జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీష్ (27) అనే యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.