Road work | సారంగాపూర్, మే 27: మండలంలోని రేచపల్లి నుండి బట్టపల్లి క్రాసరోడ్డు వరకు, రేచపల్లి నుండి మ్యాడరం తండా వరకు ఉన్న తారు రోడ్డు నిర్మాణం పూర్తిగా గుంతలా మాయంగా మరడంతో గత ప్రభుత్వంలో రినివల్ బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన రేచపల్లి నుండి బట్టపల్లి క్రాస్ రోడ్డు వరకు నాలుగు కిలో మీటర్లు, మ్యాడారం వరకు కిలో మీటర్ పాత రోడ్డును తొలగించి కంకర వేసి చదును చేశారు.
అదే సమయంలో ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపి వేశారు. పనులు ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా పనులు జరగడం లేదు. కంకర రోడ్డుతో ప్రజలు, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం ఓ కారు కంకరరోడ్డుపై అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.