Kappathalli | హుజూరాబాద్ రూరల్, జూన్ 20 : కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో వర్షాలు కురవాలని శుక్రవారం రైతులు కప్పతల్లి ఆడారు. రోకలి బండను అలంకరించి మధ్యలో కప్పను కట్టి డప్పు సప్పులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లారు. అధిక సంఖ్యలో మహిళలు కప్పపై నీళ్లు పోస్తూ సాంప్రదాయ పద్ధతిగా మొక్కులు తీర్చుకున్నారు. సమృద్ధిగా వర్షాలు వర్షాలు కురిసి పంటలు పండాలని వరుణ దేవుణ్ణి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు ఉన్నారు.