సారంగాపూర్ : మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల, కోనాపూర్ శ్రీ దుబ్బ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలపై(Mahashivratri) మంగళవారం తహసీల్దార్ జమీర్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల అధికారులు తమవిధి నిర్వహణలో నిమగ్నమై పని చేయాలని సూచించారు. ఆయా శాఖల వారీగా చేపట్టే పనులపై చర్చించి పలు సూచనలు చేశారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ కార్య నిర్వహణ అధికారి అనూష పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎంపిడిఓ చౌడారపు గంగాధర్, ఎంపీఓ సలీం, వైద్యాధికారి రాధ, ఎస్ఐ దత్తాద్రి, ఏఈ రాజమల్లయ్య, ఏఈ ప్రవీణ్, ఆయా శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.