సారంగాపూర్, జూలై 10: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (Contributory Pension) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఆయన 2025- 26 కు సంబంధించిన తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల తర్వాతే అన్ని క్యాడర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డీఏలు అన్ని చెల్లించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పాఠశాలలో ఖాళీలుగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జకిలేటి శ్రీనివాస్ రావు, సిర్ర శ్రీనివాస్, జిల్లా బాధ్యులు మధు మునీందర్, శ్రవణ్ కుమార్ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.