Kathlapur | కథలాపూర్, సెప్టెంబర్ 21: కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన సంగ మల్లయ్య (58) అనే వ్యక్తి సౌదీ అరేబియా దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సంగ మల్లయ్య గత కొంతకాలంగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా దేశం వెళ్లి వస్తున్నాడు. చివరగా రెండు నెలల కిందట మల్లయ్య ఇంటికి వచ్చి వెళ్లారని కుటుంబసభ్యులు తెలిపాడు. సౌదీ అరేబియా దేశంలో ఆయిల్ ఏరియాలో తోట కాపరిగా పనిచేసేవాడు. ఈ నెల 15న మల్లయ్య తన గదిలో ఉండగా.. బీపీ పెరగడంతో స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు అక్కడున్న వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహం స్వగ్రామానికి పందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కుటుంబం కోరింది.