మెట్పల్లి: మెట్పల్లిలో వీధి కుక్కలు (Stray Dogs) వీరంగం సృష్టించారు. స్కూల్కు వెళ్తున్న విద్యార్థులపై దాడికి చేశాయి. దీంతో పది మంది చిన్నారులు గాయపడ్డారు. పట్టణంలోని బోయవాడలో ఉన్న కాన్వెంట్ హై స్కూల్కు విద్యార్థులు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీధి కుక్కలు వారిపై దాడిచేయడంతో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
స్కూల్ సమీపంలో కుక్కలు తిరుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించడంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.