Collector Satya Prasad | కోరుట్ల, ఫిబ్రవరి 20 : ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలను ఇవాళ పరిశీలించారు. అక్రమంగా మట్టి తరలించేందుకు ఉపయోగించిన జేసీబీని గుర్తించిన కలెక్టర్ సీజ్ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మట్టి, ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఏసుకొని గుట్ట ప్రాంతంలో 1254 సర్వే నెంబర్లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలోనీ పలు విభాగాలను సందర్శించి, కార్యాలయ రికార్డులను పరిశీలించారు.
ఇంటి పన్నులు వంద శాతం పూర్తికి కృషి చేయాలని కమిషనర్ బట్టు తిరుపతికి సూచించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో త్రాగునీటికి ఇబ్బందులకు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ ఇట్యాల కిషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!