కోరుట్ల : గ్రూప్ 4 ద్వారా ఉద్యోగాలు పొందిన వార్డు అధికారులకు, మున్సిపల్ అసిస్టెంట్ ఉద్యోగులకు సమంగా పే స్కేల్ అమలు చేయాలని మున్సిపల్ వార్డు అధికారులు అన్నారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కు వినతి పత్రం అందజేశారు.
పే స్కేల్ అమలు చేసి ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వారు విన్నవించారు. సానకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వార్డు ఉద్యోగులు తెలిపారు.