MLA Dr. Sanjay Kumar | జగిత్యాల, మే 28 : ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే, కాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల ఐఎంఏ, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించి, పరీక్షల సరళిని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు వారి జీవన విధానం, వ్యాయామం, వాకింగ్ ద్వారా ఆరోగ్యం గా ఉంటారన్నారు. ఐఏంఏ వారు క్యాన్సర్ నివారణ చర్యలపై కరపత్రం ప్రచారం వల్ల అవగాహన పెరుగుతుందన్నారు.
ఇది మంచి కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మూఢనమ్మకాలు నమ్మవద్దనీ, సైన్స్‌ను నమ్మి ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యం అన్నారు. ప్లాస్టిక్ వాడకం నివారణ చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. రోగం వచ్చాక చికిత్స కనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఐఎంఏ అధ్యక్షులు డా హేమంత్, వైద్యులు మోహన్ రెడ్డి, వజ్రాల గంగాధర్, మధు, శ్రవణ్, శ్రీనివాస్, డా.సుధీర్, డా.సురేష్, మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, డా బాను,వైద్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.