సారంగాపూర్, సెప్టెంబర్ 3: మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మపులి మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం సీఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల పరిషత్ కార్యలయంలో ఎంపీడిడి, ఎంపీఓలకు కార్చకులు సమస్యలు పరిష్కరించాలని కోరుతు వినతి పత్రాలు అందజేశారు. కార్మికులకు మెడకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలన్నారు. ఆన్లైన్లో పేర్లు లేని వారిని పేర్లు నమోదు చేయాలని సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రీన్ చానల్ ద్వారా ప్రతి నెల 1న సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హమీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మినెంట్ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ ఇన్యూరెన్స్ బీమా అమలు చేయాలని, ఆర్హక అనుభవం ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని పలు డిమాండ్లను పరిష్కరంచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎవుసం కొండయ్య, ఉపాధ్యాక్షులు ఉప్పులోపు పోషాని, ప్రధాన కార్యదర్శి గోవర్ధన శ్రీకాంత్, కోశాధికారి బెక్కెం లక్ష్మీరాజం, కార్మికులు చిలుముల లచ్చయ్య, అదికల లింగయ్య, రెడ్డి, మబ్బయ్య, పోచయ్య దర్శయ్య, లచ్చన్న, రమేష్ తదితరలు పాల్గొన్నారు.