మల్లాపూర్, మార్చి 18: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రబోధించారు. పవిత్రమైన గోదావరి నది తీరం ఒడ్డున నెలకొల్పిన శ్రీ విశ్వేశ్వర మహపీఠం భవిష్యత్తులో అద్భుత పీఠంగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్పల్లి గ్రామంలో శ్రీ విశ్వేశ్వర మహాపీఠం వ్యవస్థాపకుడు ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ చక్ర ఆలయం నిర్మాణానికి మంగి రాములు మహారాజ్తో కలిసి పరిపూర్ణానంద స్వామి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి నది తీరంలో విశ్వేశ్వర మహాపీఠంతో పాటు, శ్రీ చక్ర ఆలయం నిర్మాణంతో ఈ ప్రాంతానికి ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంటుందన్నారు.
ప్రతి ఒక్కరికి అధ్యాత్మిక భావం ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుందని, ఈ ప్రాంతంలో అధ్మాత్మిక భావాన్ని పెంపొందించేందుకు శ్రీ ప్రణవానందస్వామి చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర, ఎంపీపీ కాటిపల్లి సరోజన, సర్పంచ్ బద్దం సరిత, తదితరులు పాల్గొన్నారు.