సారంగాపూర్, ఏప్రిల్ 22 : ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు తాగినీటి సౌకర్యం కల్పించాలని డీఆర్డిఓ పీడీ రఘువరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డిఓ పీడీ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువగా ఉన్నాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ, ఎండీ సలీం, ఏపీఓ శ్రీలత, గ్రామ కార్యదర్శులు సంతోష్, సర్వశ్రేష్ట, పీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.