మల్లాపూర్, జనవరి 13: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజు పల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుండి అక్రమంగా ఇసుక రవాణాను అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్టేషన్ కు తరలించారు.
గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉన్న సుమారు 28 ట్రిప్పుల ఇసుక డంపులను సీజ్ చేసినట్లు వెల్లండిచారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజేష్, అశోక్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.