పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్యాల ఐసీడీఎస్ ఏసీడీపీవో అరవింద మట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యం కోసం సమతుల పోషకాహారాలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆకుకూరలు, పండ్లు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో మండల సూపర్వైజర్ మహేశ్వరితో కలిసి ఏసీడీపీవో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత, శ్రీలత, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.