ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 6: గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన నిజమాబాద్‌లోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. ప్రజలు రేవంత్‌రెడ్డి అబద్ధపు మాటలతో కాంగ్రెస్‌కు ఓట్లేసి మోసపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలు రేవంత్‌రెడ్డి మోసాన్ని గమనించి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.