జగిత్యాల : అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివని డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ అన్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణల ఆయన ఎనలేని సేవ చేశారున్నారు. అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలకు అందిచేందుకు ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం నిర్వహిస్తున్నామని శ్యామ్ తెలిపారు. రాజ్యాంగం మార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రేలపాలు పలికిన అలాంటి అవకాశాలు రాజ్యాంగం అనుమతించదని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాడానికి ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తక్కళ్ల దేవయ్య మట్టపూలు పత్రిక సంపాదకులు, ఆనంతుల కాంతారావు తెలంగాణ శక్తి ఎడిటర్, కంటె అంజయ్య ప్రధాన కార్యదర్శి పట్టణ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బోనగిరి దేవయ్య, క్యాస జయపాల్ రెడ్డి న్యాయవాది, దాసరి లచ్చయ్య సిరికొండ మాజీ సర్పంచ్, దాసరి ప్రవీణ్, రుద్ర మనోహర్, బొల్లం ప్రభాకర్, చెనల్ల సుమన్, సంకె మహేష్, దాసండ్ల కమలాకర్,మారంపల్లి సదానందం, సుంకరిపల్లి అశోక్,దుర్గం మోహన్, గాజుల మోహన్, గజ్జెల రాజు,బండ్ర మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.