జగిత్యాల : జగిత్యాలలోని పురాతన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. గురువారం ఉదయం ప్రార్థన సమయంలో పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉంటుందా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో లైబ్రరీ, ల్యాబ్ వినియోగంపై ఆరా తీశారు. గత మే మాసంలో ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ పై ఇచ్చిన శిక్షణ పాఠశాలలో ఏ మేరకు అమలు అవుతుందని తనిఖీ చేశారు.
అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి లెసన్ ప్లాన్స్ టీచింగ్, డైరీలు, బేస్ లైన్ జవాబు పత్రాలను తనిఖీ చేశారు. భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఈ మాసంలో ఉద్యోగ విరమణ పొందుతున్న దుర్గా ప్రసాద్‌ను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, మండల విద్యాధికారి చంద్రకళ, సెక్టోరియల్ ఆఫీసర్లు మహేష్, రాజేష్, పిఆర్టియు టిపిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనంద్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.