మల్యాల, జూన్ 22 : తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామ ని, దేశానికే ఆదర్శంగా నిలిచామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించేందుకే దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం, కేసీఆర్ కృషితో స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్యాల మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొ ని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించా రు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభతోపాటు మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, 2014 కంటే ముందు ఉన్న తెలంగాణ, ప్రస్తు తం చూసుకుంటే ఎంతో ప్రగతి కనిపిస్తున్నదన్నారు. ఆనాడు ఇక్కడ వరద కాలువను నిర్మించినా ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ప్రయోజ నం లేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి తరలించేందుకు రాంపూర్‌లో పంప్‌హౌస్‌ను నిర్మించామన్నారు. అప్పటి నుం చి ఎడారిలా ఉండే వరదకాలువ 365 రోజులు నీటినిల్వతో జీవనదిలా మారిందన్నారు. తాటిపల్లిలో వరదకాలువ నుంచి కాకతీయ కాలువలకు కాళేశ్వరం జలాలను తరలించేందుకు లింక్ కెనాల్‌ను ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నామన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడితే పూర్తిగా అంధకారంలో ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారని, ఈనాడు రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చె ప్పారు. భవిష్యత్తులో మిగులు విద్యుత్పత్తి రాష్ట్రంగా ఏర్పడనుందన్నారు. ఉద్యమ సమయంలో రామన్నపేటకు కోరుట్ల రవి చెప్పులు వేసుకోనని శపథం చేశాడని, తెలంగాణ ఏర్పడ్డాక అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ రవితో చెప్పు లు తొడిగించారన్నారు. ఆనాడు స్వరాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నాయకులు సైతం ఇప్పుడు ద శాబ్ది ఉత్సవాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారన్నారు. వారందరికీ ఒకటే సమాధానమని, తెలంగాణలో సబ్బం డ వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారరని చెప్పారు. అందు కే దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని చె ప్పారు. అనంతరం ఎంపీపీ మిట్టపల్లి విమల-సుదర్శన్ దంపతులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశం, ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్‌రావు, వైస్ ఎంపీపీ పోతాని రవి, సహకార సంఘ అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు, ము త్యాల రాంలింగారెడ్డి, బోయినిపల్లి మధుసుదన్‌రావు, ఎంపీటీసీలు అనిత, సంజన, రవళి, రేణు క, నర్స మ్మ, షపియావలీభేగం, సంగాని రవి, నవత, సర్పంచ్‌లు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, గడికొప్పుల రమేశ్, గడ్డం జలజ, రైతుబంధు సమితి అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు అజహర్, నా యకులు జనగం శ్రీనివాస్, పొన్నం మల్లేశం, క్యాతం భూపతిరెడ్డి, వలీభేగం, మొత్కు కొమురయ్య, త్రినాథ్, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జోగినిపల్లి శ్రీనివాస్ గౌడ్, రాకేశ్, రంజిత్, ఆసం శివకుమార్, మల్యాల గణేశ్ పాల్గొన్నారు.