సారంగాపూర్ : యువత అంబేద్కర్(Ambedkar )ను ఆదర్శంగా తీసుకుని గొప్పగా ఎదగాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(MLA Sanjay) అన్నారు. సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయటం ద్వారా భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. అంబేద్కర్ మార్గంలో నడిచి విద్య, సంస్కారం పెంపొందించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
దేశంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యం అయిందన్నారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత దేశంలో భారత రాజ్యాంగం పాటించడం ద్వారా నే ఐకమత్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శోభన్, ప్రధాన కార్యదర్శి ప్రేమానందం, మండల, గ్రామ నాయకులు గుర్రాల రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సొల్లు సురేందర్, ఢిల్లీ రామారావు, సుధాకర్ రావు, శేఖర్ గౌడ్, నరసింహరెడ్డి, నారాయణరావు, స్వామి, సాయిలు, జలపతి, ధర్మయ్య, ప్రసాద్ శాంసన్, శేఖర్, మల్లయ్య, దళిత సంఘం నాయకులు నారాయణ, అడ్వకేట్ లక్ష్మీ నారాయణ, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.