జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండటంతో స్థానిక నాయకులతో కలిసి విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 3లక్షల రూపాయల విలువగల ఎల్వోసీని గురువారం నరేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన అల్లెపు అనిల్‌కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 60వేల రూపాయల విలువగల చెక్కును అందజేశారు.