జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
సీసీ రోడ్లను నాణ్యతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ వల్లేపు రేణుక ,కో ఆప్షన్ మెంబర్ వడకపురం శ్రీనివాస్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.