ఇబ్రహీంపట్నం, మే 28: ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో పల్లె దవాఖానలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జిల్లా వైద్యాధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఒక్కొక్క పల్లె దవాఖానకు ఎన్హెచ్ఎం నిధుల నుండి రూ. 20 లక్షల చొప్పున నిధులతో పల్లె దవాఖానలు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పల్లె దవాఖానలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల కోసం నాడు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఉపవైద్యాధికారి శ్రీనివాస్, మండల వైద్యాధికారి అనిల్ కుమార్, నాయకులు నోముల లక్ష్మారెడ్డి, దశరథ్ రెడ్డి, జగన్ రావు, వేమూరి సత్యనారాయణ, తీగల రవీందర్ రెడ్డి, గుంటి దేవయ్య, జెడి సుమన్, వైద్య సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.