కోరుట్ల, సెప్టెంబర్ 3: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్ట భవిత పాఠశాలలో మంగళవారం ప్రత్యేక విద్యను అభ్యసిస్తున్న 8 మండలాలు (కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, భీమారం, రాయికల్, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ )కు చెందిన దివ్యాంగ విద్యార్థులకు జిల్లా విద్యశాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు శ్రూష కాంబ్లీ, తుషార్ ద్వివేది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల అనంతరం దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అలీమ్ కో సంస్థ తరపున అందజేయనున్నట్టు మండల విద్యాధికారి గంగుల నరేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిందర్, జిల్లా సర్వశిక్షకమ్యూనిటీ కోర్దినేటర్ మహేష్, ప్రధానోపాధ్యాయురాలు మీరాబాయి, సిఆర్పి గంగాధర్, ఐఈఆర్పిలు భాగ్యలక్ష్మి, స్రవంతి పాల్గొన్నారు.