గోదావరిఖని : రాష్ట్రంలో ఆటో నడుపుతున్న వారి ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ఏప్రిల్ మొదటి వారం మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభం ప్రారంభిస్తామని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు. నెలరోజులపాటు ఆటో రథయాత్ర రాష్ట్రాన్ని నలుమూలల చుట్టూ ముట్టి మే మొదటి వారంలో హైదరాబాద్ చేరుకొని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు . గోదావరిఖనిలో జిల్లా ఆటో జేఏసీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఆటోలకు మాత్రమే బడ్జెట్ కేటాయించకపోవడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రత్యేక ఆటో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరాలు కాస్తున్నా ఇంకా ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తూనే ఉన్నందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటో రథయాత్ర నిర్వహించి కాంగ్రెస్ మోసాన్ని ఎండగడ తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల సురేష్, రాష్ట్ర నాయకులు నీలారపు రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాశిపేట రాజయ్య, జిల్లా కోశాధికారి వెంకట్ రెడ్డి, గాజుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.