జగిత్యాల జిల్లా గొల్లపల్లి రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొత్తకొండ నాగరాజు బైక్పై వెళ్తుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్డు స్మశాన వాటిక వద్ద బైక్ అదుపుతప్పింది. ఈ ఘటనలో నాగరాజు రోడ్డు మీద పడిపోయాడు. అప్పుడే వెనుక వస్తున్న టాటా ఏస్ వాహనం అతడి తల మీదినుంచి వెళ్లింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.