పెగడపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండలం సంచర్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుంటాల శ్రీనివాస్ అధ్యక్షతన పార్టీ జండా ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో నంచర్ల గ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోలి సురెందర్ రెడ్డి, బండి వెంకన్న, ఆదినవేని తిరుపతియాదవ్, రంగు ప్రభాకర్ గౌడ్, మంత్రి హరిగోపాల్, ఏల్పుల సురెందర్, తిరుపతి, వేణు, రామగౌడ్, ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, ఉమ్మెంతుల భాస్కర్‌రెడ్డి, మాదారపు కరుణాకర్‌రావు, ఉప్పలంచ లక్ష్మణ్, బొమ్మెన స్వామి, మడిగెల తిరుపతి తదితరులున్నారు.