పెగడపల్లి : తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెగడపల్లి, ఏడుమోట్లపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని మల్లారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదారపు కరుణాకర్ రావు గాజుల గంగాధర్, కోరుకంటి రాజేశ్వరరావు, బొమ్మన స్వామి, పలుమారు విజయ్ యాదవ్, నాగుల రాజశేఖర్ గౌడ్, వెల్మ సత్యనారాయణ రెడ్డి, కాసెట్టి వీరేశం, రాచకొండ ఆనందం, ముద్దం మల్లేశం, ఈరవేణి రాజమల్లు, హరిలాల్ నాయక్ తదితరులున్నారు.