కోరుట్ల : సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పైన నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోరుట్లలో న్యాయవాదులు మంగళవారం తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడి భారత న్యాయ వ్యవస్థపైనే జరిగిన దాడిగా మేము భావిస్తున్నామని చెప్పారు.
ఇది భారతదేశ న్యాయ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థకు మంచివి కావన్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ ఫసియుద్దీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కడకుంట్ల సదశివ రాజు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఊరడి నరేందర్, రాసభక్తుల రాజశేఖర్, సీనియర్ న్యాయవాదులు మచ్చ వెంకట రమణ మూర్తి, బద్ది నర్సయ్య, సంగ విజయ్, బూరుగు గణేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.