హుజూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అప్పటి పాలకులు, ప్రభుత్వాలను ఎదిరించి జైలు పాలైన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను రానున్న ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. శనివారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ కళాశాల సమావేశ మందిరంలో నియోజకవర్గ ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ముఖ్య నాయకులతో పోలాడి రామారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గెల్లు శ్రీనివాస్ ఉద్యమంలో 130కి పైగా కేసులు మీద వేసుకున్నాడని గుర్తు చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఓసీ సంఘాల సమాఖ్య తరఫున ఈ నెల 10 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ చైతన్య యాత్రలు చేపట్టి పల్లెల్లో నిద్ర చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామం తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ప్రజల మద్దతు కూడగడతామని తెలిపారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సంఘాల అధ్యక్షుడు తాటిపల్లి రాజన్న, నాయకులు కాసం వీరారెడ్డి, పింగిళి కోమల్‌రెడ్డి, బైరెడ్డి సాయిరెడి,్డ తిప్పిరెడ్డి సంజీవరెడ్డి, పోల్సాని అనిల్‌రావు, మూల పుల్లారెడ్డి, నల్లా సత్యనారాయణరెడ్డి, సింగిరెడ్డి సమ్మిరెడి,్డ విష్ణుదాస్ గోపాల్‌రావు, తీగల కొండల్రావు, కాళ్ల శివరాములు, వెంకట్రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.