పెగడపల్లి: పెగడపల్లి (Pegadapalli) ఎస్ఐ రవీందర్ కుమార్‌కు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంస పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో బాధ్యతగా వ్యవహరించినందుకుగాను ఎస్ఐ రవీందర్‌ను ఎస్పీ ప్రశంసించారు. భారీగా తరలి వచ్చిన భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రిస్తూ, శాంతి భద్రతలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విధులపై చూపిన నిబద్ధత ఇతర పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ కొనియాడారు. ఎస్ఐకి జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రం అందజేయడం పట్ల పెగడపల్లి పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.