Jagtial people | కేసీఆర్ సారున్నప్పుడే మంచిగుండె. రేవంత్ రెడ్డి వచ్చినంక మంచిగా లేదని జగిత్యాల ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ మహిళ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, తులం బంగారం లేదు.. పిల్లలు పుడితే కిట్టు లేదు. బస్సుల్లో డ్యూటీకి పోయొస్తే 9 గంటల దాకా బస్సు కూడా లేదు. నైట్ ఆటోకు పోతే మాకు కష్టమవుతుంది. అన్ని పథకాలు సార్ పెట్టినయే కానీ రేవంత్ వచ్చినంక ఒక్కటి కూడా లేవు. వాడు పెద్ద వేస్ట్గాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ఒక్క రూపాయి కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతాడని జగిత్యాల మహిళ మండిపడ్డది.
రేవంత్ రెడ్డి మళ్లీ ఓటు కోసం వస్తే చెప్పు చూపిస్తామని మరో యువతి హెచ్చరించింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఏం సాయం చేసిండో చూపియ్యమనండి. డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు కూడా కేసీఆర్ కట్టిచ్చినవే. కాంగ్రెస్ వాళ్లకే ఇచ్చిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని మాకు వచ్చిన సీట్లు కూడా రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేయించాడని మండిపడ్డది.
రేవంత్ రెడ్డి అన్ని ఉన్నోళ్లకే ఇస్తున్నాడు.. లేనోళ్లకి ఏమీ చేయడం లేదని మరో మహిళ ఆరోపించింది. రేవంత్ రెడ్డి మమ్మల్ని కోటీశ్వర్లను చేయడం ఏమో కానీ మేము బిచ్చం అడుక్కునే పరిస్థితి మాత్రం వచ్చిందని వాపోయింది. కాంగ్రెస్ వాళ్లు ఓటు అడగడానికి వస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి అన్ని ఉన్నోళ్లకే ఇస్తున్నాడు.. లేనోళ్ళకి ఏమీ చేయడం లేదు
రేవంత్ రెడ్డి మమ్మల్ని కోటీశ్వర్లను చేయడం ఏమో కానీ మేము బిచ్చం అడుక్కునే పరిస్థితి మాత్రం వచ్చింది
కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే చెప్పుతో కొడతాను – జగిత్యాల ప్రజలు https://t.co/rX6mntQxpB pic.twitter.com/Yxx500yDF1
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
రేవంత్ రెడ్డి మళ్లీ ఓటు కోసం వస్తే చెప్పు చూపిస్తాము
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్న లంచం ఇవ్వాల్సిందే
మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని మాకు వచ్చిన సీట్లు కూడా రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేయించాడు – జగిత్యాల ప్రజలు https://t.co/aS1ujoYIl1 pic.twitter.com/NQvfcFmrbj
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
రేవంత్ రెడ్డి పాలనకి దండం పెట్టాలి.. వాడు పెద్ద వేస్ట్ గాడు
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే.. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా లేదు
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ఒక్క రూపాయి కూడా చూడలేదు
రేవంత్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతాడు – జగిత్యాల ప్రజలు pic.twitter.com/X6U4Bh9gxy
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు