జగిత్యాల విద్యానగర్, డిసెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కిక్ బాక్సింగ్ బెల్ట్, గ్రేడింగ్ అండ్ టెక్నికల్ సెమినార్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తెలంగాణకు చెందిన నికత్ జరీన్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేంచుకొని సాధనకు నిర్విరామంగా శ్రమించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, ప్రతాప్, డబ్ల్యూ ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంతోష్ అగర్వాల్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, చీఫ్ కోచ్ ఇండియన్ కిక్ బాక్సింగ్ టీం సురేశ్ బాబు, కోచ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.