Jagityal | కొడిమ్యాల, జులై 03 : ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఎంపీవో సతీష్, ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.