Adluri lakshman kumar | వెల్గటూర్, ఏప్రిల్5 : అర్హులందరికీ సన్న బియ్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం అందజేస్తుందని, రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
మండలం కేంద్రంలోని రేషన్ దుకాణాల్లో ఆయన శనివారం లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యం అందించాలనే లక్షంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.