Collector Satyaprasad | నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ సత్యప్రసాద్
Collector Satyaprasad | వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Collector Satyaprasad | జగిత్యాల, జూన్ 26 : జగిత్యాల జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (ఎన్ఎస్పీసీ) 2025 పోస్టర్ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలని పేర్కొన్నారు.
ఈ పోటీని హరిత్, ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందన్నారు. జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయనీ, కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఫలితాలు ఆగస్టు 30న విడుదల విడుదల చేస్తామన్నారు.
పోటీ ఐదు విభాగాలలో..
1. 1వ తరగతి నుండి 5వ తరగతి,
2. 6వ తరగతి నుండి 8వ తరగతి
3. 9వ తరగతి నుండి 12వ తరగతి
4. డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు
5. ఇతరులు / సాధారణ పౌరులు
పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు. ఈకో మిత్ర https://ecomitram.app/nspc/ అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషల్లో క్విజ్ అందుబాటులో ఉంటుందని.. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న మీ సెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతీ విద్యార్థికి పాల్గొన్నందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందనీ, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ పోటీలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె రాము, బీసీ వెల్ఫేర్ అధికారి సునీతా, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Also :
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

