Satya Prasad | ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ సత్య ప్రసాద్
Satya Prasad | ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ వివేకానంద స్టేడియంలోని ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జగిత్యాల, ఫిబ్రవరి 26 : ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ వివేకానంద స్టేడియంలోని ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 పోలింగ్ కేంద్రాల్లో 53 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు, 20 ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
12 సెక్టార్లలో ప్రతి రూట్ బ్యాలెట్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికలలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా ఎలక్షన్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

