జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో బుధవారం ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేస్తారన్నారు.
అందులో భాగంగా ఈ రోజు ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కలెక్టరెట్ ఏ.ఓ.హకీం, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ తహసిల్దార్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.