మల్లాపూర్, అక్టోబర్ 29: గ్రామాల్లోని ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని ముదిరాజ్ మహసభ సంఘం మండలాధ్యక్షుడు చిట్యాల లక్ష్మణ్ అన్నారు. బుధవారం జగిత్యాలజిల్లో మల్లాపూర్ మండలంలోని పాత దాంరాజ్పల్లి, కొత్త దాంరాజ్పల్లి, వాల్గొండ, మొగిలిపేట, ఓబులాపూర్ గ్రామాల్లో సంఘాల నాయకులతో వేర్వేరుగా సమావేశాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సంఘం బలోపేతానికి కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కటై పోటీ చేయాలని కోరారు. ముదిరాజ్ కులస్తులు గ్రామాల్లో రాజకీయంగా రాణిస్తే రానున్న రోజుల్లో కులానికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యాక్షుడు బోయిని హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాయకులు పల్లి మధు, బోండ్ల రవి, తదితరులు పాల్గొన్నారు.