రాయికల్, ఫిబ్రవరి 11: విద్యార్థులు సెల్ ఫోన్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జగిత్యాల ప్రాజెక్టు ఐసిడిఎస్ సిడిపిఓ మమత(CDPO Mamatha) పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయికల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ప్రేరణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఆడ పిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉంటూ దేశ ప్రగతికి రథచక్రాలుగా మారాలన్నారు.
ప్రస్తుత తరుణంలో పిల్లలు మొబైల్ ఫోన్, డ్రగ్స్‌కు ఆకర్షిలవుతున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు లోనుకాకుండా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికి కొంత మంది బాల్య విహాలు చేస్తున్నారని, అది సరైంది కాదన్నారు. ఆడపిల్లలను బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, స్వప్న, సఖి కేంద్రం కౌన్సిలర్ గౌతమి, సూపర్వైజర్లు పద్మావతి, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.