సారంగాపూర్, జూలై 27 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తేలు రాజు అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో పోతారం ఎంపీటీసీ పరిధిలోని బట్టపల్లి, పోతారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి తమవంతు కృషి చేయాలన్నారు.
నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్యలు వచ్చిన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ గెలపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మెన్ సాగి సత్యం రావు, మాజీ ప్రజాప్రతినిధులు పునుగోటి విజయరంగారావు, బైరి మల్లేష్ యాదవ్, గుర్ర స్వామి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కోల శ్రీనివాస్, నాయకులు లింగం మల్లేశం, రాజయ్య, బోదాసు నర్సింగం, గుర్రం రవి, మల్యాల గంగారెడ్డి, ప్రకాష్, మధు, తదితరులు పాల్గొన్నారు.