జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ సన్మానించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణను జగిత్యాలలోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్, ఉప సర్పంచ్ బోడ రాజ్ కుమార్, వార్డు సభ్యులు నవ్య సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, వెలమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు అయిల్నేని సాగర్ రావు, ఇమ్మనేని ప్రశాంత్ రావు, గొపాటి సురేందర్ రావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.