జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, తుల ఉమ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 20న మోతెలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతుందని తెలిపారు. లక్షకు పైగా జనాభాకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ప్రజాభీష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రెండున్నరేళ్లలో తెలంగాణ అస్తవ్యస్తమైందని విమర్శించారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
జీవన్ రెడ్డి ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించిన ఆయన బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల అభిప్రాయంతోనే బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వచ్చారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి మార్గదర్శనం, సూచనలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.