Korutla | ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు.
కోరుట్ల, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సరళి పై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలదీశారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేరు గొప్ప ఊరూ దిబ్బ అన్న చందంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ రెండు సంవత్సారాల నుంచి పట్టణంలో, వార్డుల్లో కనీస సౌకర్యాలను మెరుగు పరచకుండా ఇపుడు ప్రజాపాలన అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ద ఉన్న ప్రజా సమస్యలపై లేదన్నారు. సంపన్నులకు వత్తాసు పలుకుతూ పేద ప్రజలపై తమ ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. పేదలు పన్నులు చెల్లించకుంటె వారి కరెంటు, నల్లా కనెక్షన్లు తొలగించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు గొప్పవని, కాని ఆచరణ మాత్రం శూన్యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలనా యంత్రాంగం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ లు వసీం, హఫీజ్ బాబా, మోసిన్, కోక్కెర మహేష్ యాదవ్, పోట్ట సురేందర్ నాయకులు ఎలుగూరి కిరణ్, జాల వినోద్, టెకుల నరేష్, అర్బాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

