Korutla | కోరుట్లలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సమక్షంలో యూసూఫ్ నగర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కోరుట్ల, జూన్ 10 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సమక్షంలో యూసూఫ్ నగర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఈశ్వర్, పెద్ద భూమయ్య, మణిదీప్, రాజు, తుక్కయ్య, నయమతుల్లాలకు గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
అధికారంలో లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, బట్టు సునీల్, పొట్ట సురేందర్, అతిక్, జాల వినోద్, టేకుల నరేష్, నీలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

