బైక్ దొంగల అరెస్ట్
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను కాకతీయ యూనివర్సిటీ, సీసీఎస్ పోలీసులు పట్టుకొని 28 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ ఎన్ శ్వేత నిందితుల అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
- ఇద్దరి నుంచి 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సుబేదారి,ఆగస్టు 3 : ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను కాకతీయ యూనివర్సిటీ, సీసీఎస్ పోలీసులు పట్టుకొని 28 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ ఎన్ శ్వేత నిందితుల అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఇందిరమ్మకాలనీకి చెందిన పీకే రాజయ్య, ఇదే జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ కలిసి వరంగల్, కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, హైదారాబాద్, రాచకొండ కమిషనరేట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 28 బైక్‌లు చోరీ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్‌లపై డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. కేయూ పీఎస్ పరిధిలో పల్సర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన రాజయ్య, సాయి కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు కేయూ పీఎస్ మునిపల్లి, ఎల్కతుర్తి సమీప ప్రాంతాల్లో దాచిపెట్టిన 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. వాహనదారులు తమ బైక్‌లు పార్కింగ్ చేసినప్పుడు తప్పక హ్యాండిల్‌తో పాటు వీల్ లాక్ చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, హరికృష్ణ, కేయూ ఇన్స్పెక్టర్ రవికుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్‌రాజు, సిబ్బందిని సీపీ అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

