జగిత్యాల, మార్చి 19 : ఒక అమ్మ చనిపోయి కూడా మృతదేహం రూపంలో కాబోయే వేల మంది డాక్టర్లకు ఉపయోగపడనున్నది. తాను బతికి ఉన్ననాల్లు బిడ్డగా, తల్లిగా, అత్తగా, నానమ్మ, అమ్మమ్మగా కుటుంబానికి అమ్మగా సేవలు అందించి తనువు చాలించినప్పటికి వైద్యులకు తమ వృత్తి నైపుణ్యాలకు ఆమే పార్థివదేహం ఉపయోగపడడమే కాకుండా మెడికల్ కళాశాలలో ఆమె నిత్యం కళ్లముందే దర్శనం ఇస్తూ సజీవంగానే ఉన్నాను అంటోది భూమక్క. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన చిట్ల భూమక్క (85) స్వగృహంలో మృతి చెందారు. అయితే భూమక్క కుమారుడు చిట్ల రవీందర్ నా తల్లి బతికుండగా నా కుటుంబానికి ఏ లోటు లేకుండా అన్ని రకాల సేవలు అందించి ఉన్నతంగా తీర్చి దిద్దిందనితెలిపారు.
అయితే తల్లి ఎప్పటికి బతికుండాలానే అలోచించి కొన్ని నెలల క్రితం తల్లి భూమక్క పార్థివా దేహం ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీకి దానం చేస్తానని రవీందర్ రాసిచ్చాడని తెలిపారు. భూమక్క మృతి చెందగా మెడికల్ కాలేజీకి మృత దేహాన్ని అప్పగించారు. 20 ఏళ్ల వరకు కాలేజీలో భూమక్క పార్థివ దేహం ఉంటుందని, కుటుంబ సభ్యులు కాలేజీకి వచ్చి చూసుకోవచ్చని యాజమాన్యం తెలిపారు. ఈ మేరకు చిట్ల రవీందర్‌ను పలువురు అభినందించారు. కాగా, ఇప్పటి వరకు జగిత్యాల నుండి కేవలం ముగ్గురు మాత్రమే పార్థివదేహాలు దానం చేశారని అందులో రాయంచ ప్రభాకర్, మరొకరు, చిట్ల భూమక్క ఉన్నారు.