Bhu Bharathi | చిగురుమామిడి, జూన్ 20: మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
తహసీల్దార్ ముద్దసాని రమేష్ మాట్లాడుతూ రెవెన్యూ గ్రామసభలలో వివిధ సమస్యలపై అప్లికేషన్ ఫారాలు వచ్చినాయని అన్నారు. వాటిని పరిశీలించి రెండు నెలలలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఉల్లంపల్లి గ్రామంలో శుక్రవారం చివరి భూభారతి రెవెన్యూ గ్రామ నిర్వహించడం జరిగిందని, గ్రామంలో 106 దరఖాస్తులు రావడం జరిగిందనీ అన్నారు.
ఈ రెవెన్యూ గ్రామ సభలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ స్వరూప రాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అరుణ్ కుమార్, తార దేవి, పంచాయతీ కార్యదర్శి మైలారపు జ్యోతి, రెవిన్యూ సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, అనిల్, విజయ్, సంతోష్ , రికార్డ్ అసిస్టెంట్ శ్వేత, అనిత, ప్రవీణ్,రైతులు పాల్గొన్నారు.