Aksharabhyasam : జగిత్యాల రూరల్ మండలంలోని మోర పెళ్లి గ్రామం అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం (Aksharabhyasam), అన్నప్రాసన(Annaprasana) కార్యక్రమం నిర్వహించారు. శనివారం పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం 7 నెలల నుండి 3 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలకు పౌష్టికాహారం బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు.
ఆద్యంతం సంబురంగా సాగిన సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట రాజేందర్, ఉప సర్పంచ్ అగునూరి గంగరాజం, సూపర్ వైజర్ లావణ్య, MLHP అనూష, ANM శ్రీశైలం, శిరీష, అంగన్వాడీ టీచర్లు సంకోజి పద్మారాణి, జమున, శైలజ, ఆశా కార్యకర్తలు సత్యవాణి, రేవతి, తదితరులు పాల్గొన్నారు.