గోదావరిఖని : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సూచన మేరకు ఆర్జీ 1 ఏరియా నుండి 30 మంది ఉద్యోగులను పంపిస్తున్నట్లు జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 2 నుంచి సింగరేణి రెస్క్యూ సిబ్బందిని సహాయ చర్యల కోసం పంపించిన క్రమంలో ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు ముమ్మరమైన క్రమంలో రామగుండం డివిజన్ వన్ నుంచి నుంచి చురుకైన 30 మంది సింగరేణి సంస్థ ఉద్యోగులను సహాయ చర్యల కోసం పంపించినట్లు జీఎం పేర్కొన్నారు.
అలాగే సహాయ చర్యల కోసం మరో 100 మందిని కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎండీ బలరాం హామీనిచ్చారు. రాష్ట్రంలో వివిధ రకాల విపత్తులు ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ నుంచి రెస్క్యూ సిబ్బంది సింగరేణి ఉద్యోగులను సహాయ చర్యల కోసం పంపించిన మాదిరిగానే నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సహాయ చర్యల కోసం పంపించారు.